రైతు రుణమాఫీ పై పూర్తి వివరాలు తెలిపిన సీఎం రేవంత్

- June 21, 2024 , by Maagulf
రైతు రుణమాఫీ పై పూర్తి వివరాలు తెలిపిన సీఎం రేవంత్

హైదరాబాద్: ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో 16 వేల కోట్ల రూపాయలు, 2018లో 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిందని చెప్పారు.

రూ.2 లక్షల వరకు రుణమాఫీకి తమ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి.. 2023 డిసెంబర్ 9 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. త్వరలోనే జీవో విడుదల చేస్తామని అందులో పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు.
రేవంత్ రెడ్డి కామెంట్స్

  • మే 6 వరంగల్ డిక్లరేషన్ లో రుణమాఫీ ఇచ్చాం
  • వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయడమే మా లక్ష్యం
  • సోనియా మాట ఇస్తే శిలాశాసనం..
  • రాహుల్ .. ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటున్నాం
  • పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం 28 వేలకోట్ల రూపాయల రుణమాఫీ మాత్రమే చేసింది
  • డిసెంబర్ 11 ,2018 కటాఫ్
  • డిసెంబర్ 12, 2018 నుండి -డిసెంబర్ 9 , 2023 రెండు లక్షలు మాఫీ చేయాలని నిర్ణయించాం
  • 31 వేల కోట్లు అవుతుంది.. రైతులను రుణవిముక్తులను చేస్తాం
  • సింగిల్ స్ట్రోక్ తో రుణమాఫీ చేస్తాం
  • రైతు సంక్షేమతో రైతు రాజ్యం మా లక్ష్యం
  • రైతు భరోసా పై చిలువలు పలువులుగా విమర్శలు ఉన్నాయి
  • పారదర్శకంగా రైతు భరోసా అందిస్తాం.. స్టిక్ హోల్డర్స్ తో సూచనలు తీసుకుని అమలుచేస్తాం
  • రైతులు, సంఘాలు , అందరితో సబ్ కమిటీ చర్చిస్తుంది
  • రైతు భరోసా పై..జూలై 15 లోపు సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది
  • అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అందిస్తాం
  • ప్రభుత్వ నిర్ణయాలు, వివరాలపై శ్రీధర్ బాబు, పొంగులేటి మీడియాకు వివరిస్తారు
  • ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి అందుబాటులో ఉంటారు
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com