భారత దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం..

- June 21, 2024 , by Maagulf
భారత దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం..

శ్రీనగర్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత్ లో ఘనంగా పాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇక జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డునున్న షేర్ -ఏ-కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

50 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకొంటున్నామన్న మోడీ, విదేశాల్లో యోగా చేసే వారిసంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ఒక్క జర్మనీలోనే నిత్యం కోటిమందికి పైగా యోగా చేస్తున్నారని వివరించారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని గుర్తుచేశారు. యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం దక్కిందన్న మోడీ, భారత్‌లోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయన్నారు. కోట్ల మందికి యోగా అనేది దైనందిన కార్యక్రమమైందని వివరించారు. ధ్యానంతో ఏకాగ్రత, యోగాతో అపారశక్తి కలుగుతాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com