నాగార్జున అలా ఫిక్సయ్యారా.?
- June 22, 2024
తెలుగు బిగ్‌బాస్ షో వస్తుందంటే చాలు.. దానిపై జరిగే ఎనాలసిస్‌లు, వివాదాలూ ఏవైనా సరే క్రేజీగానే వుంటుంటాయ్.
ముఖ్యంగా హోస్ట్ విషయంలో జరిగే రచ్చ. ఈ సారి హోస్ట్ ఈయనట.. ఆ హీరో అట.. కాదు కాదు ఫలానా అట.. అంటూ అనేక రకాల క్రేజ్ న్యూస్. ఈ సారి కూడా అంతే.
త్వరలో బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ అదే చర్చ. ఈ సారి హోస్ట్‌గా నాగార్జున రావట్లేదంట అని. కానీ, బిగ్‌బాస్‌కి పర్మినెంట్ హోస్ట్‌గా నాగార్జున ఫిక్సయిపోయారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న తాజా సమాచారం.
ఓ వైపు బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూనే మరోవైపు నాగార్జున ఏదో ఒక సినిమా కూడా పూర్తి చేసేస్తుంటారు. అలా ఈ సారి ఏం సినిమా చేస్తున్నారన్నదే ఉత్కంఠ.
‘నా సామిరంగ’ సినిమా తర్వాత ఆయన సినిమాల స్టేటస్ ఏమీ తెలియ రాలేదు. బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ, దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతవరకూ రాలేదు.
కానీ, బిగ్‌బాస్ స్టార్ట్ అయ్యే లోపే తన కొత్త సినిమా అప్టేట్ కూడా ఇవ్వబోతున్నారట నాగార్జున. చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









