యూఏఈ క్రికెట్ లో విషాదం.. మైదానంలో కుప్పకూలిన మన్దీప్ సింగ్..!
- June 22, 2024
యూఏఈ: మన్దీప్ సింగ్ ఆకస్మిక మరణంతో యూఏఈ క్రికెట్ సమాజం షాక్‌లో ఉంది. అతను ఇకపై తమతో లేడని వారు రోదిస్తున్నారు. గురువారం (జూన్ 20) రాత్రి జరిగిన మ్యాచ్ లో అతడు మైదానంలోనే కుప్పకూలి మరణించాడు. విజన్ క్రికెట్ గ్రౌండ్ మేనేజ్మెంట్ షార్జా మైదానంలో దుబాయ్ సూపర్ కింగ్స్ (DSK) టైటాన్స్‌తో జరిగిన T22 మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. DSK జట్టు ప్రకారం.. మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ 17వ ఓవర్ వేయడానికి మన్‌దీప్‌ను కాల్ చేశాడు. అయితే అతను తనకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు. క్రీజు అవతలి వైపున పడుకున్నాడు. మిగతా ప్లేయర్స్ అతనికి ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్‌లు మరియు క్యాండీలు కూడా అందించారు. 10-15 నిమిషాల తర్వాత తేరుకున్నాడు. మ్యాచ్ ముగియగానే మన్దీప్ తన సహచరులతో కలిసి ఇంటికి బయల్దేరాడు. స్టేడియం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో షార్జా-నజ్వా రహదారిలో ఉండగా, మళ్లీ అసౌకర్యం మరియు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని తెలిపారు. ఆ తర్వాత కారులోనే కుప్పకూలిపోయాడు. అతన్ని అల్ దైద్ ఆసుపత్రికి తరలించారు. కానీ అంతకుముందే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ముంబైకి చెందిన మన్‌దీప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దుబాయ్‌కి చెందిన ఎయిర్‌లైన్ కంపెనీలో పనిచేస్తున్న అతను గత 15 సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తున్నాడు. మన్దీప్ మరణవార్త యూఏఈలోని క్రికెట్ ఔత్సాహికులను కలచివేసింది. ఆటగాళ్లు తమ ప్రియమైన సహచరుడు మరియు స్నేహితుడికి హృదయపూర్వక నివాళులర్పించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







