జూన్ 18న విడుదల కానున్న 'రోజులు మారాయి' ఆడియో

- June 12, 2016 , by Maagulf
జూన్ 18న విడుదల కానున్న 'రోజులు మారాయి' ఆడియో

దర్శకుడు మారుతి కథతో ఎస్వీఎస్‌ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో వస్తున్న చిత్రం 'రోజులుమారాయి'. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల తేదీ ఖరారైంది. కృతిక, తేజస్వి, చేతన్‌ మద్దినేని, పార్వతీశం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. అదేవిధంగా చిత్రం ఆడియోను 18న విడుదల చేయనున్నట్లు దానికి సంబంధించిన కొత్తపోస్టర్‌ను చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. జి.శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం.మురళీకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com