ఫుజైరా హోమ్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు మృతి
- June 26, 2024
యూఏఈ: ఫుజైరాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతుల్లో 8 ఏళ్ల బాలిక మరియు 7 ఏళ్ల బాలుడు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల చిన్నారిని అధికారులు రక్షించారు. సివిల్ డిఫెన్స్ ఆపరేటింగ్ రూమ్‌కు మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు అల్ తువియాయిన్లోని ఓ ఇంటిలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే ఇంటికి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా, దేశంలో వేసవి కాలం ప్రారంభమవుతున్నందున అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ఫుజైరా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ ఒబైద్ అల్ తునైజీ ప్రజలను కోరారు. ఎయిర్ కండిషనింగ్ మరియు శీతలీకరణ పరికరాల వల్ల విద్యుత్ లోడ్లు పెరిగే ప్రమాదం ఉన్నందున, ఎలక్ట్రికల్ లైన్ల నిర్వహణ, వాటి భద్రతను నిర్ధారించాలని ఆయన నివాసితులను కోరారు. ఫుజైరా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ బిన్ ఘానెమ్ అల్ కాబి ఇద్దరు పిల్లల మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







