బాలీవుడ్ పైనే ‘కల్కి’ ఫోకస్ అంతా.! ఇది దారుణం.!
- June 26, 2024
రేపే అనగా జూన్ 27న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఎక్కడికక్కడ ‘కల్కి’ మేనియా. పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి ప్రబాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో సందడి చేస్తున్నారు.
ఆన్ లైన్ బుకింగ్స్ హౌస్‌ఫుల్స్, ఇక ధియేటర్ల వద్ద బారులు మామూలే. ఇంత హంగామా బాగానే వుంది కానీ, టాలీవుడ్లో ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదన్న టాక్ మరో మూల వినిపిస్తూనే వుంది.
ఫ్యాన్స్ ఎంత హడావిడి చేసినా, చిత్ర యూనిట్ కూడా ఎంతో కొంత కాదు కాదు, చేయాల్సినంత చేయాలిగా. కానీ, తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక్క ఇంటర్వ్యూ లేదు.
బాలీవుడ్లో మాత్రం వరుసగా ప్రెస్ మీట్లు, ఈవెంట్లు జరుగుతున్నాయ్. నాగ అశ్విన్‌తో సహా ప్రబాస్ కూడా అక్కడే ఫోకస్ పెట్టారు. అక్కడి ప్రెస్ మీట్స్‌లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె హైలైట్ అవుతున్నారు.
అలాగే మన తెలుగు మీడియాకి సంబంధించి ప్రెస్ మీట్లు నిర్వహించడం, ఇంటర్వ్యూలివ్వడం రోజుకో పోస్టర్ చొప్పున రిలీజ్ చేసుకోవడంలాంటివి చేయాలిగా. అదే టాలీవుడ్ జనం హర్టవుతున్నారు.
మరి, ‘కల్కి’కిది విపరీత పరిణామమే. డబ్బింగ్ సినిమానా.? అనేంత అనుమానాలు కూడా వినిపిస్తున్నాయ్. ఇంతవరకూ వచ్చిన టీజర్, ట్రైలర్స్.. ఇలా వేటిపైనా టాలీవుడ్ జనం అంత సంతృప్తికరంగా లేరు. చూడాలి మరి, రేపు రిలీజ్.. ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ ఎలా వుండనుందో.!
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







