కువైట్ లో ముగియనున్న క్షమాభిక్ష పథకం..కీలక సమీక్ష
- June 28, 2024
కువైట్: జూన్ 30తో క్షమాభిక్ష పథకం ముగియనున్నందున రెసిడెన్సీ ఉల్లంఘించిన వారిపై భద్రతా ప్రచారాల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు వివిధ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రత్యేక దళాల వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అధ్యక్షత వహించారు.
అంతర్గత మంత్రిత్వ శాఖ మార్చి 17 నుండి జూన్ 17 వరకు క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించింది, అనంతరం జూన్ 30 వరకు దానిని పొడిగించబడింది. రెసిడెన్సీ చట్టం ఉల్లంఘించినవారు ఎటువంటి పెనాల్టీ లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి మరియు కొత్త వీసాపై తిరిగి రావడానికి లేదా వారి ఉల్లంఘనలను పరిష్కరించుకోవడానికి అనుమతించారు. క్షమాభిక్ష కాలంలో దేశం విడిచి వెళ్లని లేదా వారి బసను చట్టబద్ధం చేయని, ఉల్లంఘించిన వారిపై అన్ని గవర్నరేట్‌లలో భద్రతా ప్రచారాలను ఎలా నిర్వహించాలనే దానిపై ఈ సమావేశం సమీక్షించింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







