చెస్: ప్రపంచ టాప్ 10 లో ముగ్గురు ఇండియన్స్ ..
- July 02, 2024
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్ లిస్ట్‌లో (ర్యాంకింగ్స్) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్‌లు టాప్-10లో నిలిచారు. 2024 జులై నెల ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్ ఏడులో, ఆర్ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు.
భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్ లిస్ట్ టాప్ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్ ఉండటం గమనార్హం.
మహిళల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్ లిస్ట్ టాప్-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్ వరల్డ్ టైటిల్‌ను గెలిచిన దివ్య దేశ్‌ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







