నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. వారించిన వృద్ధ జంటపై యువకుడు దాడి
- July 05, 2024
మనామా: 22 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాద ఘటన తర్వాత వృద్ధ దంపతులపై హింసాత్మక దాడికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంపై వారు కొప్పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. 57 మరియు 62 సంవత్సరాల వయస్సు గల దంపతులు తమ వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత కారును నడుపుతున్న నిందితుడు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నడపడం చూసిన జంట సదరు డ్రైవర్ ను హెచ్చరించడానికి హారన్ కొట్టారు. ట్రాఫిక్ లైట్ వద్దకు రాగానే ఇద్దరు తమ వాహనాలను ఆపారు. ఈ సమయంలో నిందితుడు కారు దిగి, దంపతుల పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు. ముగ్గురు వ్యక్తులు కారు నుండి దిగి ఆ జంటపై దాడికి పాల్పడ్డారు. 57 ఏళ్ల వ్యక్తిని తన్నడంతో అతను పడిపోయాడు. అతని ఎడమ కాలు విరిగింది. ప్రాసిక్యూషన్ విచారణలో నిందితుడు దాడిని అంగీకరించాడు. 57 ఏళ్ల బాధితుడు 12% శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నాడని వైద్య నివేదిక ధృవీకరించింది. 62 ఏళ్ల బాధితుడు కూడా ఈ సంఘటనలో గాయపడినట్టు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు.. జూలై 8న తీర్పును వెలువరించనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







