రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై కువైట్ కొరడా
- July 06, 2024
కువైట్: రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. జూన్ 30తో కార్మికులు కువైట్ ప్రకటించిన క్షమాభిక్ష పథకం గడువు ముగిసిన విషయం తెలిసిందే. ప్రత్యేక భద్రతా దళాలు అల్-ఖురైన్, హవల్లీ మరియు మహ్బౌలా మార్కెట్లలో తనిఖీలను నిర్వహించాయి. ఈ సందర్భంగా149 మందిని అదుపులోకి తీసుకున్నారు. హవల్లి, ఫర్వానియా, అల్-ముత్లా మరియు అల్-దజీజ్లలో కూడా భద్రతా తనిఖీలను నిర్వహించారు. అక్కడ కూడా 114 మందిని అరెస్టు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి ప్రయాణ టిక్కెట్‌కు చెల్లించే వారితో సహా, ఉల్లంఘించిన వారికి ఆశ్రయం కల్పించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భద్రతా ఏజన్సీలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికార యంత్రాంగానికి నివేదించాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







