రకుల్‌ లక్కు మామాలుగా లేదుగా.!

- July 11, 2024 , by Maagulf
రకుల్‌ లక్కు మామాలుగా లేదుగా.!

రకుల్ పనైపోయిందనుకున్న ప్రతీసారీ మళ్లీ స్టార్ ఛాన్స్‌తో దూసుకొస్తోంది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది అప్పట్లో.

ఆ తర్వాత బాలీవుడ్‌కెళ్లింది. అటుపై తెలుగులో అవకాశాలు తగ్గినా.. బాలీవుడ్‌లో మంచి మంచి ఆఫర్లు అందుకుంటోంది. అవన్నీ ఒకెత్తయితే, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘భారతీయుడు 2’ ఇంకో ఎత్తు ఆమె కెరీర్‌లో.

‘భారతీయుడు 2’ సాధారణ సినిమా కాదు. ఇలాంటి సినిమాలో ఆఫర్ అంటే అంత ఆషా మాషీ కాదు. అలాంటిది రకుల్‌కి ఆ ఛాన్స్ దక్కింది. ప్రచార చిత్రాలు చూస్తుంటే ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత వున్నట్లే కూడా వుంది.

కేవలం ‘భారతీయుడు 2’ మాత్రమే కాదు, ‘భారతీయుడు 3’లోనూ రకుల్‌కి మంచి స్కోప్ వుండబోతోందట. చూస్తుంటే, ఇప్పట్లో రకుల్ కెరీర్‌కి ఢోకా లేదనిపిస్తోంది.

ఈ సినిమా తర్వాత తెలుగులోనూ రకుల్‌కి మళ్లీ మంచి మంచి ఆఫర్లొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. చూడాలి మరి. ‘భారతీయుడు 2’ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ సేనాపతిగా లీడ్ రోల్ పోషిస్తుండగా, సిద్దార్ధ్, ఎస్.జె సూర్య, సముద్ర ఖని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com