కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఇది విన్నారా.?
- July 11, 2024
యంగ్ హీరోల్లో ఓ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణివారు’ సినిమాతో చాలా మామూలుగా పరిచయమైన ఈ కుర్ర హీరో, ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’, ‘వినరా భాగ్యము విష్ణు కథ’, ‘రూల్స్ రంజన్’ ‘మీటర్’ తదితర సినిమాలతో గుర్తింపు దక్కించుకున్నాడు.
ఈ హీరో నటిస్తున్న సినిమాలు హిట్టవుతున్నాయా.? ఫట్ అవుతున్నాయా.? అనే సంగతి పక్కన పెడితే, అవకాశాలు మాత్రం వరుసగా వస్తూనే వున్నాయ్. ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడీ యంగ్‌స్టర్.
అదే ‘క (KA)’. ఇదేనండీ సినిమా టైటిల్. ఓహో K అంటే కిరణ్ A అంటే అబ్బవరం.. తన పేరే అనుకుంటున్నారు కదా. నిజానికి అంతే. కానీ, సినిమాలో ఈ రెండు అక్షరాలకూ ఏదో బలమైన అర్ధముండబోతోందట. అందుకే ఆ టైటిల్ పెట్టారట. కోఇన్సిడెంట్గా తన పేరు మీదుగా ఈ టైటిల్ అలా సెట్టయిపోయింది.
టైటిల్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన కిరణ్ అబ్బవరం సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో కానీ, ఇదో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాని తెలుగుతో పాటూ, సౌత్‌లోని పలు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారట. సుజిత్ అండ్ సందీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







