లోన్స్ తీసుకున్న వారికి షాక్ ఇచ్చిన ఎస్బీఐ
- July 15, 2024
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు నేడు తెలిపింది. కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
సవరించిన రేట్లు నేటి (జులై 15) నుంచే అమలులోకి వస్తాయని ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఏడాది కాలవ్యవధి గల ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి.. ఆరు నెలల కాలవ్యవధికి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి.. రెండేళ్లకు 8.85 శాతం నుంచి 8.95 శాతానికి, మూడేళ్ల కాలపరిమితి 8.95 శాతం నుంచి 9 శాతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత లోన్ల ఈఎంఐలు మరింత ప్రీమియం కానున్నాయి. ఎస్‌బీఐ ఆటో రుణాలు ఒక సంవత్సరం, వ్యక్తిగత రుణాలు 2 సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానం చేశారు.
కాగా, ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక రుణ రేటుగా నిర్ధరాంచింది. నిధుల సేకరణకు బ్యాంకులకు అయ్యే వ్యయం, నిర్వహణ వ్యయం, క్యాష్ రిజర్వు రేషియో, కాల పరిమితి, ప్రీమియంలను పరిగణలోకి తీసుకుని ఎంసీఎల్ఆర్‌ను సీఎస్బీఐ లెక్కిస్తుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు రుణం అందించే ఛాన్స్ ఉండదు.. వివిధ కాలపరిమితులకు (ఓవర్ నైట్ నుంచి మూడేళ్ల వరకు) ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటాయి. ఎస్‌బీఐ ప్రస్తుతం గృహ రుణాలను 'ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్స్' ఆధారంగా అందిస్తుంది. ఇందులో మాత్రం ఎలాంటి సవరణలు చేయలేదని పేర్కొనింది. ప్రస్తుతం ఈ ఈబీఎల్‌ఆర్ 9.15శాతం + సీఆర్‌పీ + బీఎస్‌పీ దగ్గర స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం ఎస్‌బీఐ హోం లోన్ వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంది. సిబిల్ స్కోర్ సహా ఇతర అర్హతలను బట్టి ఇది మారిపోతుంది.
తాజా వార్తలు
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!







