నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ
- July 15, 2024
నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలిని నియమించినట్లు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు. ఓలితోపాటు కొత్త మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది.ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలింది.దీంతో 77 సీట్లున్న కేపీ శర్మ(CPN-UML), 88 సీట్లున్న బహదూర్(NC) కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేశారు. తొలి 18 నెలలు ఓలి, ఆ తర్వాత బహదూర్‌గా ప్రధానిగా కొనసాగుతారు. ఓలితోపాటు ఆయన మంత్రివర్గం సోమవారం ప్రమాణం చేయనుంది. గతంలో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి 2015–16, 2018–2021 సంవత్సరాల మధ్యలో పనిచేశారు. అయితే, అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021 మే 13వ తేదీన మరోసారి ఓలిని రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ ప్రధానిగా నియమించడం వివాదమైంది. ఈ నియమాకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఓలి అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఏర్పడిన సంకీర్ణంలో మరో ఐదు పార్టీలు చేరే అవకాశాలున్నాయంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







