అమెరికా కాల్పుల్లో కొత్త విషయాలు వెలుగులోకి

- June 14, 2016 , by Maagulf
అమెరికా కాల్పుల్లో కొత్త విషయాలు వెలుగులోకి

అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన కాల్పులకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన ఒమర్ మతీన్ భార్యను ఈ కేసులో విచారణకు చేరుస్తున్నారు. ఆమెకు ఈ దాడి గురించి ముందే తెలిసి ఉంటుందని అమెరికా లా ఎన్‌ ఫోర్స్ మెంట్ విభాగం అనుమానిస్తోంది. ఎందుకంటే ఒమర్ మతీన్ దాడులకు పాల్పడిన గే క్లబ్బుకు ఆమె స్వయంగా పలుమార్లు తీసుకొని వెళ్లిందంట. అంతేకాదు.. ఈదాడికి వారం ముందు ఆమె పలు చోట్లకు అతడితోపాటు వెళ్లిందని, అలా ఇద్దరు వెళ్లిన సమయంలోనే దాడికి కావాల్సిన ఆయుధాలను మతీన్ సమర్చుకూర్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమెకు ఈ దాడి గురించి ఆమెకు తెలుసన్న కారణాలతో ఒమర్ భార్య అయిన నూర్ మతీన్ ను త్వరలోనే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.ఓర్లాండోలోని ఓ గేల నైట్ క్లబ్బుపై ఒమర్ దాడికి పాల్పడి 49మందిని దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. మరో 50మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి చరిత్రగా మిగిలిపోయింది. కాగా, ఒమర్ కు బయటనుంచి ఆదేశాలు రాలేదని, తానే ఉగ్రవాద భావజాల ప్రేరేపితుడై ఈ దారుణానికి దిగాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా చెప్పారు. అయితే, ఇంతపెద్ద దాడి వెనుక భారీ కుట్రే ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఇప్పుడు కూపీలాగే క్రమంలో అతడి భార్యను అదుపులోకి తీసుకోనున్నారు. ఆమెను ఈ కేసుకు సంబంధించి ప్రశ్నిస్తుండగా అసలు దాడితో సంబంధం లేని విషయాలు చెబుతుందని, అవి కూడా అనుమానాస్పద విషయాలు చెబుతుందని పోలీసులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com