10వ తరగతి అర్హతతో పోస్టల్ జాబ్స్..
- July 21, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ అయినా ఇండియన్ పోస్టల్ సర్వీస్ లో 10వ తరగతి అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల అయింది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోస్ట్ ఆఫీస్ సేవలను మరింతగా చేరువ చేసేందుకు జిల్లాలోని మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న BPM/ABPM పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ప్రకటన వెలువడగా ఇందుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.
అయితే ఈ నోటిఫికేషన్స్ లో భాగంగా కర్నూలు జిల్లాలోని మండల కేంద్రాల్లో 37 పోస్టులు భర్తీ కానున్నాయి.అదే విధంగా నంద్యాల జిల్లా డివిజన్ పరిధిలోని మండల కేంద్రాల్లో 35 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన సంస్థ వాటిని భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇండియన్ పోస్టల్ సర్వీస్ అనే వెబ్సైటు లో పొందుపరిచింది.ఈ పోస్టులకు సంబంధించి పదవ పాసైన వారు అర్హులుగా తెలిపింది. పదవ తరగతి పాస్ అయి నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు ఎందుకు అర్హులని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







