హైబ్రిడ్ మోడ్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025..!
- July 24, 2024
పాకిస్తాన్: వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు పాల్గొంటుందా లేదా అన్న విషయం పై ఇప్పటికైతే స్పష్టత లేదు. శ్రీలంక వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయం పై స్పష్టత వస్తుందని భావించినా అలా జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీమ్ఇండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని వార్తలు వస్తున్నాయి.
మరో వైపు పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనున్న ఈ టోర్నీకి సంబంధించిన డ్రాప్ట్ షెడ్యూల్‌ను రూపొందించి ఇప్పటికే ఐసీసీకి అందించింది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచులు అన్ని కూడా లాహోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. భారత జట్టు సెమీ ఫైనల్, ఫైనల్‌కు క్వాలిఫై అయితే ఆ మ్యాచులను కూడా లాహోర్‌లోనే నిర్వహిస్తామని చెప్పింది.
అయితే.. బీసీసీఐ మాత్రం హైబ్రిడ్ మోడ్‌లో మ్యాచులను నిర్వహించాలని ఐసీసీని కోరినట్లుగా తెలుస్తోంది. గతంలో ఆసియా కప్‌ను వేరే దేశంలో నిర్వహించినట్లుగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచులను పాక్‌లో కాకుండా వేరే దేశంలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ వర్గాలు కోరాయి. దీనిపై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లుగా సమాచారం. ఇంకోవైపు నిబంధనల ప్రకారం మ్యాచులు అన్ని తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్తాన్ పట్టుబడుతోంది. భారత్‌ను పాక్ కు తీసుకువచ్చే బాధ్యతను ఐసీసీకి పీసీబీ అప్పగించినట్లుగా సమాచారం.
బాల్ ఐసీసీ కోర్టులో..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి మిగిలిన దేశాలతో చర్చించడం, దాన్ని ఆమోదించడం ఇప్పుడు ఐసీసీ పరిధిలో ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి. పాక్‌లో టాక్స్ విధానం, వేదికల ఎంపిక, భారత మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతులకు సంబంధించిన విషయాలను కూడా ఐసీసీకి పీసీబీ తెలియజేసినట్లు చెప్పింది.
ఇదిలా ఉంటే.. ఒకవేళ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఐసీసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం గతంలో కంటే అదనపు బడ్జెట్‌ను చేర్చింది. భారత జట్టు వేరే దేశంలో మ్యాచులు ఆడాల్సి వస్తే.. ఈ అదనపు నిధులు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!