ఏపీకి చేరుకున్న జగన్.. కార్యకర్తల ఘనస్వాగతం
- July 25, 2024
విజయవాడ: ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా అనంతరం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మాజీ సీఎంతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు.
ఇక నిన్న ఢిల్లీ లో ఏపీలో జరుగుతున్న దాడులు , హత్యలకు వ్యతిరేకంగా జగన్ తో పాటు వైసీపీ నేతలు ధర్నా చేసారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసారు. ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో జగన్ పార్టీ శ్రేణులతో దీక్షకు దిగారు. అధికార మార్పిడి జరిగిన తరువాత చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపించారు. దాడులు..దైర్జన్యాలతో పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. బాధితుల పైనే కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.
లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని తనకు నచ్చని వారి పైన కక్ష సాధిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ హోర్డింగ్ లు ఏర్పాటు చేసారన్నారు. రెండ్ బుక్ లో పేర్లు ఉన్నాయంటూ రాజకీయ నేతలు, అధికారులను వేధిస్తున్నారన్నారు. బాధితుల పైనే పోలీసులు కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తల హత్య జరిగిందని ఆరోపించారు. మేము అధికారంలో ఉన్న సమయంలో ఈ విధంగా దాడులను ప్రోత్సహించలేదని జగన్ వివరించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే సందేహం కలుగుతుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









