షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో భారీ దోపిడీ..
- July 26, 2024
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి భారీ దోపిడీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రమత్తులో ఉండగా లగేజీ దోచుకొని వెళ్లిపోయారు. మహారాష్ట్ర లాతూరు రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30 మంది ప్రయాణీకుల లకేజీని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భారీ ఎత్తున బంగారంతోపాటు ఇతర వస్తువులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.30లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
అర్ధరాత్రి 2గంటల సమయంలో ఈ దోపీడి జరిగింది. దోపిడీ జరిగినట్లు గుర్తించిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్ కు ముందున్న వర్లీ స్టేషన్ లో దిగిపోయినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో బీదర్ లో రైలును నిలిపివేసి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మూడు బోగీల్లోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులే ఉన్నారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తరువాత పలువురు ప్రయాణికులు దోపిడీ ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ పీఎస్ లో మరికొందరు ప్రయాణీకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







