పసిడి ధర కాస్త తగ్గింది
- June 15, 2016
వరసగా ఆరు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర బుధవారం కాస్త తగ్గింది. రూ.130 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది. నగల వ్యాపారుల నుంచి డిమాండు తగ్గడం, కీలక సమయాల్లో వారి నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.10శాతం తగ్గి 1,284.20యూఎస్ డాలర్లకు చేరింది.
అయితే బుధవారం వెండి ధర మాత్రం పెరిగింది. రూ.90 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,350కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో దీని ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







