యూఏఈ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం
- June 15, 2016
యూఏఈ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం నేటి నుంచి (జూన్ 15) అమల్లోకి వచ్చింది. చిన్న పిల్లల్ని దూషించడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇంట్లో ఒంటరిగా వదిలెయ్యడం లాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షింపబడతారు కొత్త చట్టం ప్రకారం. అలాగే చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోవడం కూడా నేరం. లైంగిక ఆరోపణలు, పిల్లల్ని వేధింపులకు గురిచేసిన కేసులు నమోదైతే, విధుల నుంచి తక్షణం తొలగించేలా ఈ చట్టంలో నిబంధనల్ని పేర్కొన్నారు. తల్లిదండ్రులైనా సే పిల్లల్ని మొహంపై కొట్టడం నేరం. దెబ్బలు కొట్టిన ఆనవాళ్ళు వుంటే తల్లిదండ్రులూ శిక్షింపబడతారు. ఒంటరిగా పిల్లల్ని ఇంట్లో వదిలితే శిక్ష తప్పదు. కారులో ముందు సీటులో పిల్లల్ని కూర్చోబెట్టడం నేరం. కోపంతో బిగ్గరగా అరవడం కూడా నేరమే. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూడు వార్నింగ్స్ ఇవ్వడంతోపాటు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు. ఆ పరిధి దాటితే మాత్రం చట్ట ప్రకారం శిక్ష తప్పదు. చైల్డ్ ప్రొటెక్షన్ కోసం తీసుకుంటున్న ఈచర్యలు సత్ఫలితాలనిస్తాయని అధికారులు వెల్లడించారు. పసి పిల్లలపై వేధింపులు సర్వసాధారణమైపోయాయనీ, అలాంటివాటికి ఈ చట్టం చెక్ పెడుతుందని వారు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







