అతి ఖరీదైన టైర్లు దుబాయ్ సొంతం
- June 15, 2016
కారు కన్నా కారు టైర్లు ఖరీదైనవైతే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలానే ఉంటుంది. ఈ టైర్లు కారుకి అమర్చితే, అది బెంజ్ కారు కావొచ్చు, ఇంకా ఖరీదైన కారు కావొచ్చు. కారు చిన్నబోవాల్సిందే. ఎందుకంటే ఈ టైర్లు అంత ఖరీదైనవి. 2.2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన కారు టైర్లను తయారు చేయించింది దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ. జెడ్ టైర్స్ వీటిని తయారు చేసింది. 24 క్యారెట్ గోల్డ్ మరియు డైమండ్ స్టోన్స్‌తో వీటిని తయారు చేసినట్లు సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. డిజైన్‌ని దుబాయ్‌లో చేయగా, ఇటలీలో ఆర్టిసన్ జ్యుయెలర్స్‌తో డెకరేట్ చేయించారు. అబుదాబీలో గోల్డ్ లీఫింగ్ చేశారు. నాలుగు టైర్లు 2 మిలియన్ దిర్హామ్‌లకు ఒక్కోటి చొప్పున విక్రయించారు. ప్రపంచంలోనే అతి ఖరీదైన టైర్లుగా ఈ టైర్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించనున్నాయి. జెడ్ టైర్స్ సిఇఓ హర్జీవ్ కందారి మాట్లాడుతూ, ప్రత్యేకంగా ఈ టైర్లను రూపొందించడం ప్రతిష్టాత్మకంగా భావించామని తెలిపారు. దీని ద్వారా వచ్చే లాభాల్ని రమదాన్ సందర్భంగా జెనెసిస్ ఫౌండేషన్‌కి డొనేట్ చేయనున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







