ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ ఉద్యమకారులే: మంత్రి పొన్నం ప్రభాకర్
- July 30, 2024
హైదరాబాద్: శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ… విపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులు అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ 70వ దశకంలోనే నవోదయ పాఠశాలలు, గురుకులాలను ప్రారంభించిందని తెలిపారు. వాటిల్లో చదివిన వారు చాలామంది ఉన్నతస్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. జీవచ్ఛవంలా ఉన్న ఆర్టీసీని తాము ముందుకు తీసుకు వెళుతున్నామన్నారు. ఆర్టీసీ చక్రం నడవదని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే సంస్థపై మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ ఉద్యమకారులే అన్నారు. వారిని కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!







