ప్రతిపక్ష నేత హోదా..జగన్ పిటిషన్‌పై హైకోర్టు నోటీసులు
- July 30, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ… స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరఫు న్యాయవాది ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
కక్షపూరితంగానే ప్రతిపక్ష హోదాను ఇవ్వడం లేదని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా స్పీకర్‌కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా? అని హైకోర్టు అడిగింది. గత నెల 24న ఇచ్చినట్లు జగన్ తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







