ఓటీటీలో డైరెక్ట్‌గా కీర్తి సురేష్ నటించిన సినిమా ఏంటో తెలుసా.?

- July 31, 2024 , by Maagulf
ఓటీటీలో డైరెక్ట్‌గా కీర్తి సురేష్ నటించిన సినిమా ఏంటో తెలుసా.?

మహానటి కీర్తి సురేష్ నటించిన సినిమా ఒకటి డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. అదే ‘ఉప్పుకప్పురంబు’. అమెజాన్స్ ఒరిజినల్స్ కోసం కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించింది.

ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో నటుడు సుహాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఎక్కువ శాతం కామెడీ యాంగిల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ తనకెంతో నచ్చిందనీ అందుకే వెంటనే ఓకే చేశాననీ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

వైవిధ్యమైన కథా చిత్రాలను ఎంచుకోవడంలో కీర్తి సురేష్ ఎప్పుడూ ముందుంటుంది. అయితే, ఈ మధ్య ఆమె ఎంపికలో కొన్ని తప్పులు జరుగుతున్నాయ్. తద్వారా ఫెయిల్యూర్ రిజల్ట్ చవి చూడాల్సి వస్తోంది. అయితే, ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తుందని మహానటి నమ్మకంగా చెబుతోంది. తెలుగుతో పాటూ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారట.

ఈ అమెజాన్ ప్రైమ్ కంటెంట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com