డిఫరెంట్ లుక్స్‌లోకి మారిపోయిన లవర్ బాయ్.!

- July 31, 2024 , by Maagulf
డిఫరెంట్ లుక్స్‌లోకి మారిపోయిన లవర్ బాయ్.!

వరుణ్ సందేశ్ అంటే ఒకప్పుడు అమ్మాయిల రాకుమారుడు. యూత్‌లో  విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో ఖాతాలో ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’ తదితర సూపర్ హిట్ సినిమాలు అనేకం వున్నాయ్. అయితే, అదంతా ఒకప్పుడు.

ఇప్పుడు వరుణ్ సందేశ్ హవా అంతగా లేదు. ఆ మధ్య భార్యతో కలిసి బిగ్‌బాస్ షోలోనూ సందడి చేశాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కూడా పెద్దగా కెరీర్‌లో దూసుకెళ్లలేకపోయాడు. అయితే, ఇప్పుడు డిఫరెంట్ స్టోరీస్‌తో మళ్లీ తెరపై కనిపిస్తున్నాడు.

రీసెంట్‌గా ‘నింద’ అనే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలో నటించాడు. ఓ మోస్తరు టాక్‌తో ఆ సినిమా బాగానే నెట్టకొచ్చేసింది. ఇక, ఇప్పుడు అదే తరహా ఇంట్రెస్టింగ్ కాన్సెంప్ట్‌తో  మళ్లీ వస్తున్నాడు వరుణ్ సందేశ్. అదే ‘విరాజి’.

ఈ సినిమాలోని సస్పెన్స్ సీన్లు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఖచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయంటున్నాడు. అంతేకాదు, ఈ సినిమా కోసం మన హీరో ఓ డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో కనిపిస్తున్నాడు. ఒక సైడ్ బ్లూ కలర్, ఇంకో సైడ్ ఎల్లో కలర్ షేడ్స్ వుండే హెయిర్ స్టైల్ ఫాలో చేస్తున్నాడు.

ఈ సినిమాలో వరుణ్ పాత్ర పేరు ‘యాండీ’.. ఇది కూడా కొత్తగా వుంది. కొత్తగా వున్నా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.. గుర్తుండిపోయే పాత్రవుతుంది.. అని చెబుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే హెయిర్ స్టైల్‌తో వరుణ్ సందేశ్ సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొంటుండడం విశేషం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com