8,200 మీటర్ల ఎత్తున మృతదేహం.. దుబాయ్ పర్వతారోహకుడు సహాయం
- August 01, 2024
యూఏఈ: దుబాయ్‌కు చెందిన పర్వతారోహకురాలు నైలా కియాని ఎనిమిది మంది పర్వతారోహకుల బృందానికి నాయకత్వం వహించి.. 8,200 మీటర్ల ఎత్తులో ఉన్న K2 శిఖరం నుండి ముహమ్మద్ హసన్ షిగ్రీ మృతదేహాన్ని తీసుకురావడానికి సహాయంగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఇది ప్రపంచంలోని రెండవ-ఎత్తైన పర్వతంపై ఇప్పటివరకు చేసిన అత్యధిక రికవరీగా నిలిచింది. మృతదేహాన్ని బేస్ క్యాంప్ వరకు తీసుకురావడానికి మూడు రోజులు పడింది. గత ఏడాది హసన్ వాతావరణ పరిస్థితుల కారణంగా చిక్కుకుని మరణించారు. అతడితోపాటు ఉన్న బృందం అతడిని వదిలేసి తిరిగి వచ్చేసింది.
యూఏఈ మష్రెక్ బ్యాంక్ మద్దతుతో మానవతా ప్రాతిపదికన ప్రారంభించబడిన K2 క్లీన్-అప్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పుడు సహాయం కోసం హసన్ కుటుంబం తనను సంప్రదించిందని కియాని చెప్పారు. ఇతర ఏడుగురు సభ్యులలో ఐదుగురు అధిరోహకులలో దిలావర్ సద్పరా, అక్బర్ హుస్సేన్ సద్పరా, జాకీర్ హుస్సేన్ సద్పరా, మహ్మద్ మురాద్ సద్పరా, అలీ మహమ్మద్ సద్పరా, లాజిస్టిక్స్ మేనేజర్ ఇమ్రాన్ అలీ, వలీ ఉల్లా ఫల్లాహి ఉన్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







