పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు..

- August 01, 2024 , by Maagulf
పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు..

అమరావతి: సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు.మడకశిర నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేశారు. గుండుమల గ్రామంలో ఇంటింటికి వెళ్లి మరీ స్వయంగా లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా లబ్దిదారుల కుటుంబాలతో చంద్రబాబు మాట్లాడారు.

మరోవైపు పెన్షన్ లబ్దిదారులు ఓబులమ్మకు ఇల్లు కట్టిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ను ఆదేశించారు. మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు.. ఓబులమ్మకు వితంతు పెన్షన్ అంజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కుమారులు వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపింది. తన ఇల్లు సరిగా లేకపోవడంతో వారు ఇంటికి కూడా రావడం లేదని వాపోయింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. కలెక్టర్ ని పిలిచి ఓబులమ్మ ఇల్లు బాగు చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

గుండుమలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు..లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. వారికి తన చేతుల మీదుగా పెన్షన్లు ఇచ్చారు.అంతేకాదు వారితో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వారి యోగ క్షేమాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ కు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com