‘మిస్టర్ బచ్చన్’ ఆ ఫ్లేవర్ చెడగొట్టేశారా.?
- August 01, 2024
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ మూవీ ‘రైడ్’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
రీమేకుల స్పెషలిస్టుగా హరీష్ శంకర్‌ని పిలుస్తుంటారు. చాలా రీమేకులు ఆయనకు సక్సెస్ ఇచ్చాయ్ కూడా. అయితే, ‘మిస్టర్ బచ్చన్’ విషయానికి వచ్చేసరికి ఎక్కడో తేడా కొడుతోంది.
ఇంతవరకూ రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్లన్నీ గ్లామర్ యాంగిల్నే ప్రొజెక్ట్ చేస్తున్నాయ్. కానీ, ఒరిజినల్ మూవీ విషయానికి వస్తే.. అది పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్ కూడా చాలా చప్పగా సాగిందన్న రెస్పాన్స్ వినిపిస్తోంది.
రిలీజ్‌కి ముందే అంచనాలు ఇలా వుంటే, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో అని రవితేజ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలే రవితేజకి ప్రస్తుతం టైమ్ అస్సలు బాగా లేదు. ఏ సినిమా పట్టుకున్నా మట్టయిపోతోంది.
మరోవైపు ఈ సినిమాకి రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ రూపంలో పోటీ గట్టిగానే వుంది. అంతా బాగుండి.. ఒరిజినల్ ఫ్లేవర్ చెడగొట్టకుండా రవితేజకి తగ్గ మాస్ కమర్షియల్ అంశాలతో సినిమాని తెరకెక్కించి వుంటే.. ఫర్వాలేదు. లేదంటే.. హరీష్ శంకర్, రవితేజ కాంబోలో మూడు సినిమాలొచ్చినా అవేమంత బాక్సాఫీస్ సూపర్ హిట్స్ అన్న హిస్టరీ కేూడా లేదు గతంలో. అదే హిస్టరీ రిపీట్ చేస్తేనే కష్టం మరి.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







