బ్రెజిల్: కుప్పకూలిన విమానం..62 మంది దుర్మరణం
- August 10, 2024
బ్రెజిల్: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది దుర్మరణం చెందారు. విమానంలో 58 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నారని.. అంతా మరణించారని అధికారులు వెల్లడించారు.
సావో పువాలో లోని విన్ హెడోలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. పరానాలోని కాస్కావెల్ నుంచి సావో పాలో గౌరుల్హోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన చోటుకుంది.నివాస ప్రాంతంలో…విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది.
అయితే విమానం నివాసిత ప్రాంతంలో పడిన స్థానికులు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అక్కడ ఒక నివాస ప్రాంతం మాత్రం దెబ్బతినిందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది, అధికారులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను ఆర్పేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ప్రమాద ఘటనపై అధ్యక్షుడు లుయూజ్ లులా డిసిల్వా విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







