బంగ్లాదేశ్ పరిణామాల పై స్పందించిన తెలంగాణ డీజీపీ
- August 10, 2024
హైదరాబాద్: బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు నిఘాను పెంచారు. నగరంలో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచారు. ఎవరైనా అక్రమంగావస్తే చర్యలు తీసుకుంటాని పోలీసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని అన్నారు.
బాలాపూర్ ప్రాంతం పరిధిలో 5000 మందికిపైగా రోహింగ్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వారికి గుర్తింపు కార్డులు వచ్చాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇతర దేశాల నుండి వచ్చే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న రోహింగ్యాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటందని సీపీ సుదీర్ బాబు చెప్పారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







