తల తిరుగుతోందా? కారణాలు ఇవి కావొచ్చు
- July 04, 2015
కొందరికి నడుస్తున్నప్పుడు తల తిరిగిపోతూండడం, నిలబడలేకపోవడంలాంటి సమస్యలు కనబడుతూ ఉంటాయి. దీంతో పాటు తలనొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు కూడా ఉంటాయి. సాధారణంగా ప్రయాణాల్లో తలతిప్పడం, వికారం, వాంతులువంటి సమస్యలు సాధారణంగా అన్పిస్తాయి. అయితే వీటన్నింటికీ ముఖ్య కారణం మన చెవి లోపలి భాగంలో ఉంటుంది. మొత్తం మన శరీరాన్ని కంట్రోల్ చేసే ముఖ్యమైన భాగం మన చెవి అంతర్భాగంలో ఉంటుంది. దీన్నే ఇన్నర్ ఇయర్ అంటారు. ఈ ఇన్నర్ ఇయర్ నుండి నాడుల ద్వారా మెదడుకి అనుసంధానం చేయబడి ఉంటుంది. పైన చెప్పిన సమస్యలన్నింటికీ కారణం ఇన్నర్ చెవిలోని ఏవైనా ఇన్ఫెక్షన్లూ, చిన్నచిన్న కణితులులాంటివి ఏవైనా ఉంటే వాటిని అస్సలు అశ్రద్ధ చెయ్యకుండా వైద్యుని సంప్రదించాలి. చెవి సమస్యలే కాకుండా కంటి చూపుకి సంబంధించిన సమస్యలూ, ఇంకా అధిక రక్తపోటు వంటివి కూడా దీనికి కారణం కావచ్చు, కొందరికి ఇది తెలియక తల తిరుగతుంది అంటే ఇంకేదో పెద్ద సమస్యగా భావించి భయపెడుతూ ఉంటారు. సమస్యకు ఈ కారణాన్ని గుర్తించి తగిన వైద్యుని వద్దకి వెళ్లి సలహా మేరకు తగు చికిత్స చేయించుకుంటే ఈ సమస్య మొదటి దశలోనే నివారించుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







