వేణు స్వామి పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు పిర్యాదు
- August 12, 2024
హైదరాబాద్: వేణు స్వామి పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు పిర్యాదు చేసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్.
సోషల్ మీడియా లో ఫిల్మ్ సెలబ్రిటీస్ పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది.
అసలు వ్యక్తి గత విషయాలు నలుగురి లో మాట్లాడ కూడదు అనే ఇంగిత జ్ఞానం కూడ లేని వేణుస్వామి వాళ్ళు ఎప్పుడు విడిపోతారో కూడా చెప్పేసాడు.
గతం లో సినిమా రిలీజ్ లపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసు పాలు అయినా కూడ బుద్ది రాని వేణుస్వామి నాగ చైతన్య - శోభిత లపై అలాంటి వ్యాఖ్యలే చేసాడు.
అతనిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ..తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియి తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారదకి కలిసి పిర్యాదు చేసారు.
ఈ విషయం పై స్పందించిన ఛైర్ పర్సన్ నీరెళ్ల శారద వేణుస్వామి పైన మరియు టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!