తిరుమల ఘాట్ రోడ్‌లో మళ్లీ ఆంక్షలు..

- August 12, 2024 , by Maagulf
తిరుమల ఘాట్ రోడ్‌లో మళ్లీ ఆంక్షలు..

తిరుమల: తిరుమల ఘాట్ రోడ్ లో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచారం కలకలం రేపడంతో ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్ 56వ మలుపు వద్ద వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులకు వాహనదారులు సమాచారం అందించారు. గతంలోనూ తిరుమలలో చిరుతలు కలకలం రేపాయి. పలువురు భక్తులపై దాడి చేశాయి. దీంతో కొన్నింటిని అటవీశాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

తిరుమల ఘాట్ రోడ్లలో బైక్ ల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి 55, 56వ మలుపు వద్ద బైక్ పై వెళ్తున్న కొందరికి చిరుత పులి కనిపించింది. భయాందోళనకు గురైన వాహనదారులు వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఆ వెంటనే భక్తులను అప్రమత్తం చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com