దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్..
- August 12, 2024
దక్షిణ కొరియా: అమెరికాలో పర్యటించిన పెట్టుబడులు ఆకర్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటుతోనే కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. హెచ్ఎంఐఈ మెగా టెస్ట్ సెంటర్, ఇతర అనుబంధ సంస్థలు, సరఫరాదారులను ఆకర్షించే అవకాశం ఉందని తెలిపారు. మెగా టెస్ట్ సెంటర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
కాగా, సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో హ్యుందాయ్ మోటర్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. హ్యుందాయ్‌కి చెందిన హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ సెంటర్‌ను హ్యుందాయ్ ఆధునికీకరించనుంది. మెగా టెస్ట్ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది.
తాజా వార్తలు
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!







