ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పునఃప్రారంభం...
- August 12, 2024
అమరావతి: ఆరోగ్యశాఖ మీద నేడు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు.. అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ అమలులో లోపాలు ఉండొద్దని, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజారోగ్య పరిరక్షణకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. వైద్యం విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, వైద్య సేవలను సక్రమంగా అందించాలని, మందులను అన్ని వేళలా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా 2014-19 ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలని చంద్రబాబు సూచించారు.
ఆస్పత్రిలో రోగికి అందించే వైద్య సేవలు, పరికరాలు, ఇచ్చే మందుల వివరాలను కూడా యాప్‌లో నమోదు చేయాలని అన్నారు. ఇక రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపై మండలాల వారీగా వివరాలు సేకరించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
సీటీ స్కాన్ సర్వీసెస్‌ను అన్ని జిల్లా ఆస్పత్రులలో ఏర్పాటు చేయాలని.. రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధ్యయనం చేసి వారికి మందులు అందించాలని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్సుకు సాధారణ అంబులెన్సుకు మధ్య అనుసంధానం పెంచాలన్నారు.
డోలీ మోతలు ఇంకా కనబడుతున్నాయని… ఇవి మళ్లీ రిపీట్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన బెడ్ షీట్లు అందించాలని స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని సీఎం.. ప్రభుత్వమే స్థలం అందిస్తుందని చెప్పారు. దేశంలోనే ఏపీ ఆసుపత్రుల పనితీరు బెస్ట్‌గా ఉండేలా పనిచేయాలని అధికారులకు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







