ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అవుతోన్న సూర్య ‘కంగువా’ ట్రైలర్.!

- August 13, 2024 , by Maagulf
ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అవుతోన్న సూర్య ‘కంగువా’ ట్రైలర్.!

తమిళ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి మార్కెట్ వుంది. ఆయన నటించిన ‘సింగం’ సిరీస్ సినిమాలు తెలుగులో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయ్.

ఈ మధ్య ఆయన నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోతున్నాయ్.

తాజాగా ‘కంగువా’ అనే ఓ పీరియాడిక్ చిత్రంతో సూర్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బాహుబలి’ రేంజ్ ఈ సినిమాకి కళ కనిపిస్తోంది.

 ఓ డిఫరెంట్ కథాంశంతో, భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ‘కంగువా’ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమాలోని విజువల్స్, పాత్రల చిత్రీకరణ, మేకప్స్, గెటప్స్.. పోరు ఘట్టాలు.. ఇలా అన్నీ చాలా భారీగా కనిపిస్తున్నాయ్.

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇద్దరి గెటప్స్ కానీ, ఇద్దరి మధ్యా యాక్షన్ ఘట్టాలు కానీ ఓ రేంజ్‌లో కట్ చేశారు ట్రైలర్‌లోనే.

ఇక త్వరలో రాబోయే సినిమా ఏ స్థాయి అంచనాలు నమోదు చేస్తుందో.. భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుందా.? లేదా.? సూర్యకి సెన్సేషనల్ విజయాన్ని అందిస్తుందా ‘కంగువా’ చూడాలి. ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ అయితే ట్రెమండస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com