‘సరిపోదా శనివారం’ ట్రైలర్ పండగ వచ్చేసింది.!
- August 13, 2024
నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ అప్డేట్ నుంచీ ఒక రకమైన ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం.
టైటిల్ గుర్తుండేలా ప్రతి శనివారం ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ వస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ శనివారం ట్రైలర్ రిలీజ్‌కి ముహూర్థం ఫిక్స్ చేశారు.
ఈ విషయాన్ని సినిమా నిర్మాత డివివి దానయ్య సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించారు.
ఆగస్టు 13న ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామంటూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ కూడా పెట్టారాయన సోషల్ మీడియాలో. ‘సోకులపాలెం ప్రజలు చాలా ఆసక్తిగా వున్నారు. అడ్రినలిన్ పంపింగ్ సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము..’ అంటూ డివివి దానయ్య ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అలాగే ఓ మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఈ మేకింగ్ వీడియోతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయ్. ఈ నెల 26న ‘సరిపోదా శనివారం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







