డెలివరీ బాయ్ చేతుల మీదుగా విడుదల చేసిన దేవ్ పారు చిత్రం పోస్టర్
- August 16, 2024
హైదరాబాద్: ఏకే ప్రోడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న దేవ్ పారు చిత్రం తాజాగా పోస్టర్ లాంచ్ జరిగింది. ఈ పోస్టర్ లాంచ్ వేడుక చాలా వినుత్నంగా జరిగింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసే డెలివరీ బాయ్ చేతుల మీదుగా ఈ లాంచ్ జరగడం విశేషం. తన విలువైన సమయాన్ని పోస్టర్ అవిష్కరణకు వినియోగించినందుకు దేవ్ పారు చిత్ర యూనిట్ డెలివరీ బాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఒక వీడియోను విడుదల చేశారు.
అందరి ఆకలి తీర్చడానికి డెలివరీ బాయ్స్ ఎంతో కష్టపడుతూ.. ఎండ, వాన అని తేడా లేకుండా సమయానికి ఫుడ్ అందిస్తున్నారని వారి శ్రమకు దేవ్ పారు టీమ్ ఒక చిన్న ట్రిబ్యూట్‌ను ప్లాన్ చేశారు. అందుకని ఒక డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసీ, ఆహారం తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌తో పోస్టర్ లాంచ్ చేశారు. వీరి ఐడియాకు నెటిజనులు ఫిదా అయిపోతున్నారు. పోస్టర్ లాంచ్‌ను వినుత్నంగా ఆవిష్కరించడమే కాకుండా ఇలాంటి సామాజిక బాధ్యతను అందరికి గుర్తుచేశారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు ముచ్చటించుకుంటున్నారు.
దీంతో అందరూ దేవ్ పారు పోస్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సామాన్యుడిని సెలబ్రేటీ చేసిన దేవ్ పారు టీమ్ పోస్టర్ లాంచ్‌లోనే ఇలాంటి ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారంటే ఇంకా ప్రమోషన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో, సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులను ఆసక్తి నెలకొంది. కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు, త్వరలోనే మరో సాలిడ్ అప్డేట్‌తో వస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
చిత్రం: దేవ్ పారుఎగ్జ్‌గ్యూటీవ్ ప్రొడ్యూసర్: ప్రియా అండలూరిప్రొడక్షన్ మేనజర్: మెహర్ మోనిష్ఆర్ట్ డైరెక్టర్: సాయి కధిరకాస్ట్యూమ్ డిజైనర్: పరమేశ్వర్ కృష్ణలిరిక్స్: రఘురామ్కలరిస్ట్: వి చిట్టకాంగ్డీఓపీ: అశ్విన్ అంబేద్మ్యూజిక్: ఓషో వెంకట్ఎడిటర్: ప్రతీక్ నూటిపీఆర్ఓ: హరీష్, దినేష్నిర్మాత: లోడీ ఫాహద్ అలీఖాన్రచయిత, దర్శకత్వం: అఖిల్ రాజ్
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







