మష్రూమ్స్ పిజ్జా
- July 05, 2015
కావలిసినవి
మష్రూమ్స్ - 100గ్రా
పాలకూర - రెండు కట్టలు
స్వీట్ కార్న్ - ఒకటి
పుదీనా కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు
మైదా - ఒక కప్పు
పాలు - పావులీటరు
చీజ్ తురుము - ఒక కప్పు
వెన్న - ఆరు టీ స్పూన్లు
బ్రెడ్ పొడి - ఒక చెంచా
ఉప్పు - సరిపడా
మిరియాల పొడి - అర చెంచా
తయారీ విధానం
ముందుగా మష్రూమ్స్‌ని, పాలకూరని సన్నగా తరిగి పక్కన ఉంచాలి. స్వీట్ కార్న్‌ని ఒలిచి, గింజల్ని తీసి ఒక నిముషం పాటు ఉడికించాలి. తరువాత ఒక మందపాటి బాణలి తీసుకుని దానిలో ఆరు చెంచాల వెన్న వేసి, దానిలో సన్నగా తరిగిన మష్రూమ్స్, పాలకూర ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు వేసి దానిలోని నీరు ఆవిరయ్యేవరకూ ఉడికించాలి. తరువాత మైదా వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించి దానిలో పాలు పోసి దగ్గరకు అయ్యే వరకూ ఉడికించాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర తురుము, మిరియాల పొడి, ఉప్పు వేసి, స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అంతా ఓవెన్ గిన్నెలోకి తీసుకుని, గరిటెతో సమంగా సర్ది దాని మీద బ్రెడ్ పొడి, ఛీజ్ తురుము చల్లినట్లుగా వేసి ఓవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉంచి బేక్ చేసి తియ్యాలి. ఇంకేముంది వేడి వేడి మష్రూమ్స్ పిజ్జా రెడీ. సాస్‌తో కలిపి సర్వ్ చేసుకుంటే సరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







