ఒమన్ లో రోడ్డు ప్రమాదం..క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!
- August 19, 2024
మస్కట్: ఒమన్‌లో తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న ఎమిరాటీ మహిళను అధికారులు ఎయిల్ లిఫ్ట్ చేశారు. ఈమేరకు ఆదివారం నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ వెల్లడించింది. సలాలాలో జరిగిన ఈ ప్రమాదంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులతో సహా ఎయిర్ అంబులెన్స్‌లో ఒమన్ నుంచి తరలించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో నేషనల్ గార్డ్ - నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించింది. అయితే, మస్కట్‌లోని యూఏఈ రాయబార కార్యాలయానికి సహాయాన్ని అందించడం ద్వారా వైద్య తరలింపుకు సహకరించిన ఒమానీ అధికారుల ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలు మరియు వ్యవస్థలకు కట్టుబడి ఉండాలని, ఇతరుల భద్రతను కాపాడుకోవడానికి నిర్దేశిత వేగ పరిమితిని అనుసరించాలని కూడా అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







