ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
- August 19, 2024
ఇప్పుడు ఫోటో దిగాలంటే చేతిలోని ఫోన్‌తో వందల కొద్దీ ఫోటోలు దిగొచ్చు. కానీ ఒకప్పుడు ఫోటో దిగాలంటే కూడా సంబరమే. స్టూడియో నుంచి ఆ ఫోటోలు తెచ్చుకునే వరకూ ఎదురుచూపులు. ఒక ఫోటో వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. సెల్ ఫోన్లో చూసుకునే ఫోటోలకి ఆల్బమ్ తడిమి చూసుకున్న అనుభూతికి చాలా తేడా ఉంది. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.
ఫోటోగ్రఫీ అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది. ఫోటో అంటే కాంతి గ్రాఫీ అంటే తీసుకోవడం. ఈ దినోత్సవాన్ని ఆగస్టు 19, 1910 లో మొదటిసారి జరిపారు. ఫోటోగ్రఫీ దినోత్సవం ఫ్రెంచ్ దేశానికి చెందిన లూయీస్ డాగ్యురో అనే శాస్త్రవేత్త ఆవిష్కరణల నుంచి పుట్టింది. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అప్పటినుంచి ఏటా ఆగస్టు 19 న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ 1991 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 19 న ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. 1840 లో ఇండియాలో ఫోటోగ్రఫీ ఆనవాళ్లు ఉన్నాయి. మొట్టమొదటి కేలోటైప్ ఫోటో స్టూడియో కోల్‌కతాలో స్ధాపించారు. మొదట్లో దీనిని బ్రిటీష్ రాజు, జమిందార్లు మాత్రమే ఉపయోగించేవారట. ఆ తరువాత 1877 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొట్ట మొదటి కలర్ ఫోటో 1861 లో తీశారట.
ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుండి, అంతిమ యాత్ర వరకు ప్రతి దశ కెమెరాతో బంధించాల్సిందే. ఇప్పుడు ప్రతి సెల్ ఫోన్ ఒక కెమెరా. సెల్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫిలో నైపుణ్యం పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్ తీసే ఫోటో చూస్తే కలిగే ఆనందం వేరు. నలుపు తెలుపు అయినా, సప్త వర్ణాలతో తీసింది అయినా మనసును తట్టి తీరుతుంది. అలా ఆవిర్భవించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవానికి ఏ యేటి కాయేడు ఆదరణ పెరుగుతోంది.
ఫోటోగ్రఫీపై అనేక యూనివర్సిటీలు శిక్షణ ఇస్తున్నాయి. ఒకప్పుడు మగవారు మాత్రమే ఫోటోగ్రఫీ ఇష్టపడేవారు. ఇప్పుడు మహిళలు సైతం ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఫోటోలు వాటిపై కథలు, క్రియేటివ్ ఫోటోగ్రఫీ, సాంకేతికంగా వచ్చిన మార్పులు పలు అంశాలపై చర్చిస్తారు. చాలా చోట్ల సంబంధిత ఈవెంట్లు జరుగుతాయి. ఫోటోగ్రఫీ ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంలో ఫోటోగ్రాఫర్లందరికీ ‘వరల్డ్ ఫోటోగ్రఫీ డే’ శుభాకాంక్షలు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







