విజిట్ వీసా హోల్డర్‌ల నియామకం.. భారీ జరిమానాలు..హెచ్చరిక..!
- August 19, 2024
యూఏఈ: గత వారం యూఏఈ కార్మిక చట్టానికి చేసిన సవరణ విజిట్ వీసా హోల్డర్లను నియమించుకోకుండా యజమానులను నిరోధిస్తుందని న్యాయ నిపుణులు చెప్పారు. సరైన అనుమతి లేకుండా కార్మికులను నియమించడం, వారిని యూఏఈకి తీసుకురావడం మరియు వారికి ఉద్యోగం కల్పించడం తీవ్రమైన నేరం అని పేర్కొన్నారు. “గతంలో వర్క్ పర్మిట్ లేకుండా కార్మికులను నియమించుకున్నందుకు జరిమానాలు Dh50,000 నుండి Dh200,000 వరకు ఉండేవి. తాజా సవరణ ద్వారా Dh100,000 నుండి Dh1 మిలియన్ల జరిమానా విధిస్తారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం తీవ్రతను ఇది స్పష్టం చేస్తుంది.” అని ECH డిజిటల్ డైరెక్టర్ అలీ సయీద్ అల్ కాబీ అన్నారు. కొంతమంది సందర్శకులు జాబ్ ఆఫర్ హామీతో మోసాలకు పాల్పడుతున్నాడని, బాధితుల విజిట్ వీసా గడువు ముగిసిన తర్వాత మాత్రమే బయలుదేరమని చెబుతున్నారని అల్ కాబీ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







