BAPS హిందూ దేవాలయం ఆధ్వర్యంలో రక్షా బంధన్
- August 20, 2024
యూఏఈ: అబుదాబి BAPS హిందూ మందిర్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఇందులో బ్లూ కాలర్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఆయా కంపెనీలు తమ సిబ్బందిని బస్సుల్లో ఆలయానికి తరలించారు. ప్రతి కార్మికుడికి అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రేమ మరియు రక్షణకు ప్రతీకగా ఉండే ఒక పవిత్ర దారాన్ని స్వామీజీలు కట్టిఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలపించిన సంప్రదాయ భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బీఏపీఎస్ హిందూ మందిర్ అధినేత పూజ్య బ్రహ్మవిహారి స్వామిజీ ఉత్సవాల సాంస్కృతిక విశిష్టతను వివరించారు. తమ కుటుంబాలు, ఆత్మీయులకు దూరంగా ఉంటున్న పలువురు కార్మికులు పండుగ రోజున ఆలయానికి వెళ్లే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాప్స్ ఆలయం "ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్" గా కొనసాగుతుందని బ్రహ్మవిహారి స్వామి తెలియజేశారు.




తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025