డిజిటల్ మెచ్యూరిటీ ఇండెక్స్.. అగ్రస్థానంలో "తవక్కల్నా"..!
- August 20, 2024
రియాద్: సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA)తో అనుబంధంగా ఉన్న తవక్కల్నా యాప్.. సౌదీ అరేబియాలో 2024లో డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ మెచ్యూరిటీ ఇండెక్స్‌లో 91.29% రేటుతో ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.మొత్తం 39 డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు పోటీ పడ్డాయి. తవక్కల్నా అప్లికేషన్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోని ప్రజలకు సేవలు అందిస్తుందని అధికారులు తెలిపారు. అప్లికేషన్ ద్వారా 1.2 బిలియన్ సందేశాలు, 10 మిలియన్ కార్డ్ రివ్యూలు, 650 మిలియన్ కంటే ఎక్కువ డిజిటల్ వాలెట్ రివ్యూలు, తవక్కల్నా అప్లికేషన్‌లో 170 కంటే ఎక్కువ భాగస్వాములు ఉన్నారని పేర్కొన్నారు. 32 మిలియన్లకు పైగా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే 315 కంటే ఎక్కువ సేవలను అందించే ఒకే అప్లికేషన్‌గా సౌదీ అరేబియాలోని ప్రభుత్వ సంస్థల మధ్య యాప్ ఉత్తమ పనితీరుతో అగ్రస్థానంలో నిలవడంపై అధికార యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. 2022లో ప్రారంభమైన తవక్కల్నా యాప్.. ఏడు భాషలలో తన సేవలను అందిస్తుంది. 77 దేశాలలో దీనిని యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!