ఎయిర్ ట్రాఫిక్ లో ఇండిగో టాప్
- August 20, 2024
ముంబై: భారత విమానయాన సంస్థలకు చెందిన ఫ్లైట్లలో ఈ ఏడాది జులైలో కోటి 29 లక్షల మంది ప్యాసింజర్లు జర్నీ చేశారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.30% ఎక్కువ అని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూన్‌లో దేశీయ విమానయాన సంస్థలు తీసుకెళ్లిన 1.32 కోట్ల మందితో పోలిస్తే జులైలో విమానాల్లో రద్దీ తక్కువగా ఉంది. ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ దేశీయ ఎయిర్ ట్రాఫిక్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించింది.జులైలో దాని మార్కెట్ వాటా 62 శాతానికి పెరిగింది. ఎయిర్ ఇండియా వాటా 14.30 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. జులైలో ‘విస్తారా’కు సంబంధించిన దేశీయ మార్కెట్ వాటా 10 శాతానికి చేరుకుంది. ఏఐఎక్స్ కనెక్ట్, స్పైస్‌జెట్ల వాటా 4.50 శాతం, 3.10 శాతం వరకు మాత్రమే ఉంది. అలాగే, ఆకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ల వాటా 4.70, 0.90 శాతం నమోదైంది.
తాజా వార్తలు
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!







