సడెన్‌గా కళ్లు తిరిగితే అంత ప్రమాదమా.?

- August 20, 2024 , by Maagulf
సడెన్‌గా కళ్లు తిరిగితే అంత ప్రమాదమా.?

కొందరిలో లో బీపీ, హైపర్‌టెన్షన్, అతిగా నీరసం రావడం వంటి కారణాలు కళ్లు తిరగడానికి కారణాలుగా చెబుతుంటారు. సరైన తిండి తినకపోయినా నీరసంతో కళ్లు తిరుగుతాయ్. కళ్ల ముందు చీకటి కమ్మినట్లుగా అనిపిస్తుంది కొన్ని సెకన్ల పాటు. మరి, ఇది సాధారణ సమస్యయేనా.?

అంటే కాదంటున్నారు నిపుణులు. ఇలా మైండ్ బ్లాంక్ అవ్వడాన్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని అంటున్నారు. గుండె నుంచి మెదడుకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్లనే ఇలా జరగుతుందని నిపుణులు చెబుతున్నారు.

న్యూరోలాజికల్ సమస్యగా దీన్ని పరిగణించాలి. మెదడుకు రక్త ప్రసరణ జరిగే రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలుంటాయ్. తీవ్రమైన మైగ్రేన్ సమస్యతో బాధపడేవారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయ్.

అలాగే, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువైనప్పుడు కూడా ఇలా జరిగే ప్రమాదముంది. ఆకస్మిక వణుకు, తల తిరగడం, లేదా బ్యాలెన్సింగ్ తప్పడం వంటి లక్షణాలు హార్ట్ స్ట్రోక్‌కి సంకేతాలు కావచ్చు.

రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గినా కళ్లు తిరిగే ప్రమాదముంది. కారణం ఏదైనా కళ్లు తిరిగే లక్షణాన్ని అస్సలు లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com