జూలైలో విమాన ప్రయాణికులలో 10% పెరుగుదల..QCAA
- August 26, 2024
దోహా: దేశానికి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యతో ఖతార్ తన విమానయాన పరిశ్రమలో సానుకూల వృద్ధి పథాన్ని కొనసాగిస్తోంది.ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తన తాజా ప్రిలిమినరీ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ స్టాటిస్టిక్స్‌లో జూలై 2024లో మొత్తం విమాన ప్రయాణీకుల సంఖ్య 4.7 మిలియన్లు అని తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 4.3 మిలియన్ల ప్రయాణికులతో పోలిస్తే ఇది 10 శాతం పెరిగిందన్నారు. జూలై 2023లో 22,598 విమానాల రాకపోకలతో పోలిస్తే ఖతార్ 24,179 విమాన రాకపోకలను నమోదు చేసింది.ఈ నెలలో విమాన కదలికలు 7 శాతం పెరిగాయని డేటా తెలిపింది. ఎయిర్ కార్గో మరియు మెయిల్ కూడా 13.9 పెరుగుదలను నమోదు చేసినట్లు QCAA తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పేర్కొంది. దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (HIA) 4.73 మిలియన్ల మంది ప్రయాణీకులను స్వాగతించిందని తెలిపింది.జూన్ 2024తో పోలిస్తే ఈ నెలలో విమాన ప్రయాణీకుల సంఖ్య కూడా 16.4 శాతం పెరిగింది. ఖతార్ 4.351 మిలియన్ల మంది విమాన ప్రయాణీకులు HIAకి చేరుకోగా, జూన్ 2023లో 3.738 మిలియన్ల మంది ప్రయాణికులు దేశాన్ని సందర్శించారు. .
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు