భద్రతాదళాలపై విరుచుకుపడ్డ బొకోహరామ్ ఉగ్రవాదులు..
- June 18, 2016
బొకోహరామ్ ఉగ్రవాదులు మరోసారి భద్రతాదళాలపై విరుచుకుపడ్డారు. ఈశాన్య నైగర్‌లో జరిగిన ఈ దాడిలో ఏడుగురు పోలీసులు ప్రాణాలొదిలారు. ఎస్ఐటీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్, స్థానిక మిలిటరీ వర్గాలు ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. నైగర్‌లోని ఓ టౌన్లో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అదే సమయంలో బొకోహరామ్ ఉగ్రవాదులు మిలిటరీ బరాక్స్పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. మిలిటెంట్లు ఆయుధాలు దోచుకుని వెళ్లినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పర్యటనలో ఉన్న మంత్రులెవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఇస్లామిస్ట్ చొరబాటుదారుల వల్ల ఇల్లూ వాకిలి వదులుకుని వలసబాట పట్టిన శరణార్థులు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







